హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో ‘కమీషన్ల’ పాల న కొనసాగుతున్నదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ప్రతి పనిలో, కాంట్రాక్టుల్లో 15 శాతం కమీషన్ తీసుకుంటూ తెలంగాణను లూటీ చేస్తున్నారని అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా బండి సంజయ్ బుధవారం నాగపూర్లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలకిచ్చిన ఏ ఒక హామీని కూడా ఇప్పటి వరకు పూర్తిగా అమలు చేయలేదని, అయినా తాము అన్ని హామీలు అమలు చేస్తున్నట్లుగా మహారాష్ట్ర ఎన్నికల్లో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి యాడ్స్ ఇస్తూ మోసం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.