డీకే అరుణ చరిత్ర ఏంటో ప్రజలకు తెలుసు
టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ శ్రీధర్‌రెడ్డి ఫైర్
హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్లో చేపట్టినది దొంగ దీక్ష అని రాష్ట్ర విద్య సంక్షే మ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఈడబ్ల్యూఐడీసీ) చైర్మన్ రావుల శ్రీధర్‌రెడ్డి మండిపడ్డారు. మోదీ వైఫల్యాలు, తెలంగాణకు ప్రధాని చేస్తున్న ద్రోహం గురించి సీఎం కేసీఆర్ ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా తప్పుదోవ పట్టించేందుకే బండి దొంగ దీక్ష చేపట్టారని విమర్శించారు.
ధరణితో భూమి హకుదారుల సమస్యలు తీరిపోయాయని, ఒకటి రెండు శాతం సమస్యలు ఉంటే వాటిని కూడా ప్రభు త్వం తీరుస్తుందని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేసీఆర్ ప్రెస్‌మీట్‌కు ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేత లక్ష్మణ్ ఎం మాట్లాడుతారో ఆయనకే తెల్వదని, కేసీఆర్‌ను నీడలా వెంటాడుతానంటున్న ఆయనతో ఊదు కాలదు, పీరు లేవదని ఎద్దేవా చేశారు. డీకే అరుణ నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిదని, కేసీఆర్‌పై అవాకులు చెవాకులు పేలితే మర్యాద దక్కదంటూ హెచ్చరించారు. డీకే అరుణ చరిత్ర ఏంటో తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు.