Resign Demand | కరీంనగర్ ఘటనపై బండి సంజయ్, సీఎం రాజీనామా చేయాలి : బీఆర్ఎస్ నాయకుల డిమాండ్
Resign Demand | కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బంగారు దుకాణంలో దొంగల బీభత్సంపై బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు.
కరీంనగర్ : కరీంనగర్( Karimnagar ) జిల్లా కేంద్రంలోని బంగారు దుకాణంలో దొంగల ( Robbery ) బీభత్సంపై బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. శాంతి భద్రతల వైఫల్యం వల్ల కాల్పులు జరిగాయని ఆరోపించారు. బంగారు దుకాణంలో దొంగలు చొరబడి, కాల్పులు జరిపి నలుగురిని గాయపరచడం బాధకరమని అన్నారు.
ఈ సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ( Padi Kousik Reddy ) , మాజీ మంత్రి గంగుల కమలాకర్ ( Gangula Kamalakar ) తో కలిసి పరామర్శించి ఓదార్చారు. అనంతరం ఆసుపత్రి బయట మీడియాతో వారు మాట్లాడారు. ఘటనకు కేంద్ర హోం మంత్రి బండి సంజయ్, సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని, కరీంనగర్ సీపీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ పాలనలో వందలాది సీసీ కెమెరాలను పెట్టి శాంతి భద్రతలను కాపాడామని తెలిపారు. సీసీ కెమెరాలు ప్రస్తుతం ఎందుకు పనిచేయడం లేదని ప్రశ్నించారు. బాధితులకు ప్రభుత్వమే వైద్య సహాయం అందించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల పట్ల ప్రేమ లేదని ఆరోపించారు. దోపిడీకి ఇంటెలిజెన్స్ వైఫల్యం కారణమని ఆరోపించారు.
అసెంబ్లీలో సైతం కరీంనగర్ శాంతి భద్రతలపై ప్రస్తావించానని అయినా పట్టించుకోవడం లేదని పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత తొలిసారి కరీంనగర్లో కాల్పులు ఘటన జరగడం దురదృష్టకరమని అన్నారు. కరీంనగర్ ఘటనలు పునరావృతం కాకుండా గట్టి భద్రతా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

