బండి భగీరథ్ బెయిల్ ప్రయత్నం విఫలం
తోటి విద్యార్థిని దూషించి దాడిచేసిన కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు సాయిభగీరథ్ దుండిగల్ పీఎస్‌లో స్టేషన్ బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
- కేసు దర్యాప్తులో ఉండగా స్టేషన్ బెయిల్ ఇవ్వలేమన్న పోలీసులు
దుండిగల్, జనవరి 18: తోటి విద్యార్థిని దూషించి దాడిచేసిన కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు సాయిభగీరథ్ దుండిగల్ పీఎస్‌లో స్టేషన్ బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ పరిధి బహదూర్‌పల్లిలోని మహీంద్ర (టెక్ మహీంద్ర) వర్సిటీలో బండి భగీరథ్ తోటి విద్యార్థిని తిడుతూ దాడికి పాల్పడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
వర్సిటీ స్టూడెంట్ అపెక్స్ కోఆర్డినేటర్ సుకేశ్ ఫిర్యాదు మేరకు దుండిగల్ పోలీసులు భగీరథ్‌పై వివిధ సెక్షన్ల కింద మంగళవారంకేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయమే బండి భగీరథ్ తన న్యాయవాది కరుణసాగర్తో కలిసి దుండిగల్ ఠాణాకు వచ్చారు. తనకు స్టేషన్‌బెయిల్ ఇవ్వాలని పోలీసులను అభ్యర్థించగా వారు తిరస్కరించారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉన్నందున బెయిల్ ఇవ్వలేమని తెలుపడంతో అతడు అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు తెలిసింది. ఈ కేసులో సహకరించేందుకు తాను ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటానని, ఎప్పుడు పిలిచినా విచారణకు వస్తానని భగీరథ్ పోలీసులకు చెప్పినట్టు సమాచారం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

