నల్లగొండ : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా చేసిన రుణమాఫీపై(Loan waiver) ఎక్కడా క్లారిటీ లేదు. అధికారులు అందరి లిస్ట్ బయటపెట్టాలని మాజీ జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి(Banda Narender Reddy) డిమాండ్ చేశారు. నల్లగొండ బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం బీఆర్ఎస్ నేతలతో కలసి మీడియా సమావేశంలో మాట్లాడారు.రుణమాఫీని చాలా మంది రైతులకు ఎగ్గొట్టారని ఆరోపించారు. మాఫీకి అర్హత ఏ విధంగా నిర్ణయించారో తెలుపాలన్నారు. మీరు సంబురాలు చేసుకుంటున్నారు కానీ రైతులు అయోమయంలో ఉన్నారని పేర్కొన్నారు. దీనిపై జిల్లా మంత్రి కోమటిరెడ్డి స్పందించాలన్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రూ.945 కోట్లు రుణమాఫీ చేశారు. నాడు కేసీఆర్ ఉమ్మడి జిల్లాలో రూ.1044 కోట్లు మాఫీ చేశారు. మరి మీరు ఎందుకు తక్కువ చేశారని ప్రశ్నించారు. లబ్ధిదారులను కుందించే కుట్ర చేశారని మండిపడ్డారు. రాహుల్ గాంధీతో సభ పెడతాం అంటున్నారు. దానికంటే ముందు అందరికి రుణాల మాఫీ చేయాలి, అందరికి రైతు బంధు డబ్బుల ఇచ్చి, ఆ తర్వాత సభ పెట్టాలన్నారు.
అడుగడుగునా ఆంక్షలు పెడుతున్నారు. హరీశ్ రావుని రాజీనామా చేయమని అడిగి హక్కు కాంగ్రెస్ నాయకులకు లేదన్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే అందరికి 100% రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రాజీనామాలు మాకు కొత్త కాదు. ఎన్నో హామీలు ఇచ్చి పచ్చి మోసం చేశారు. దుర్మార్గపు పాలన మీది. నిరుద్యోగులను వాడుకొని వదిలేశారు. వాళ్ల ఉసురు తగులుతుందన్నారు.