Bamboo Trees | హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): పర్యావరణానికి మేలు చేస్తూ కోట్ల మందికి జీవనోపాధిని అందించేదిగా వెదురు చెట్లకు ఓ ప్రత్యేకత. అంతర్జాతీయ మారెట్లో అయినా, అటవీ గ్రామీణ ప్రాంతా ల్లో అయినా ఇది ప్రధాన ఆదాయ వనరు. పోవాషియే కుటుంబానికి చెందిన వెదురు లో 115 జాతులు, 1,400 ఉపజాతుల మొ కలు ఉన్నాయి. కొన్ని జాతులు రోజుకి 30 సెంటీమీటర్ల చొప్పున పెరుగుతాయి. ఈశాన్య ప్రపంచంలో వెదురును పేదవాడి కలప, ఆకుపచ్చ బంగారం అని పిలుస్తారు.
ఈ కలపను కట్టడాలు, పేపర్, హస్తకళల్లోనూ ఉపయోగిస్తారు. వీటి పెంపకానికి రసాయనా లు, పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ ఏవీ అవసరం ఉం డదు. బీడు భూముల్లోనూ పెరుగుతుంది. అధిక వర్షాలప్పుడు మట్టి కొట్టుకుపోకుండా అడ్డుకుంటున్నది. వెదురు ఆకులు పశుగ్రాసంగా, సిలికాను మందుల తయారీలో ఉపయోగిస్తారు. వెదురు సామాన్లకు, ఫర్నిచర్కు, పరికరాలకు, షోకేస్ వస్తువులకు గ్లోబల్ మారెట్లో బాగా గిరాకీ ఉంది.
కేంద్ర ప్రభుత్వం వెదురు చెట్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తుంది. చెట్టుకు రూ.120 వరకు సబ్సిడీ అందిస్తోంది. ఈ చెట్లను నాటితే 4 ఏండ్ల తర్వాత నుంచి లాభాలు పొందవచ్చు. ఒకసారి నాటితే 40 ఏళ్లు రాబడి వస్తుంది. హెక్టార్లో 1500 మొకలను నాటవచ్చు. ఒ కో మొక ఐదు అడుగుల దూరం ఉండాలి. నాలుగేళ్ల తర్వాత నుంచి రూ.3 లక్షల నుంచి రూ.3.5 లక్షల వరకు పొందవచ్చు.
దేశ వ్యాప్తంగా థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి వెలువడే కాలుష్యాన్ని నియంత్రణకు బొగ్గుకు బదులుగా వెదురు గుళికలు తప్పనిసరిగా వాడాలని కేంద్ర ఇంధన కొత్త విధానం లో పేరొన్నది. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు వినియోగం వల్ల ఏటా 21లక్షల టన్నులకుపైగా బొగ్గు వాయువు కార్బండయాక్సైడ్ వాతావరణంలోకి విడుదలవుతోంది. దీంతో పర్యావరణ కాలుష్యం ఏర్పడుతోందని కేంద్ర విద్యుత్ శాఖ ఓ నివేదికలో తెలిపింది. అందు కే బొగ్గును కాల్చే సమయంలో ఏడు శాతం వెదురు గుళికల్ని వాడాలని జాతీయ ఇంధన విధానంలో కేంద్రం స్పష్టం చేసింది. అందుకే వెదురు సాగుకు ప్రోత్సాహం అందిస్తోంది.
దేశంలో 8 నుంచి 10 మిలియన్ టన్నుల వెదురు కొరత ఉంది. తెలంగాణ కూడా వివిధ రాష్ట్రాలకు వెదురును ఎగుమతి చేస్తోంది. రాష్ట్రంలో సహజసిద్ధంగా రెండు రకాల వెదు రు జాతులు ఉన్నాయి. డెండ్రోకాలమస్ స్ట్రిక్ట స్, బాంబుసా అరుండినేసియా అనే రకాలు రాష్ట్రంలోని అడవుల్లో పెరుగుతున్నాయి. జాతీ య వెదురు మిషన్ కింద, తెలంగాణ ప్రభు త్వం ఆదిలాబాద్ జిల్లా ముద్గల్లోని వెదురు ప్రదర్శన క్షేత్రంలో నాలుగు జాతులను నాటిం ది. ఈ నాలుగు జాతులు.. డెండ్రోకాలామస్ లాటిఫ్లోరస్, బాంబుసా బాలోవా (మధ్యస్థ పెరుగుదల), డెండ్రోకాలమస్ బ్రాండిసి (నెమ్మదిగా వృద్ధి చెందడం), బంబుసా తుల్డా (వేగవంతమైన పెరుగుదల)- నీటిపారుదల పరిస్థితులలో చాలా బాగా పని చేస్తున్నాయి. ముద్గల్ వ్యవసాయ క్షేత్రం అధికారులు ఈ పంటల సాగును ప్రోత్సహిస్తున్నారు.