Nizamabad | హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్‌ను నమ్మి మోసపోయామని.. ఇప్పుడు గోస పడుతున్నామని, రైతుభరోసా.. రుణమాఫీకి ఆశపడి ఓటేస్తే కాంగ్రెసోళ్లు నట్టేట ముంచారని బీఆర్ఎస్ రైతు అధ్యయన కమిటీ ఎదుట రైతులు తమ గోడు వెల్లబోసుకున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు కొండంత ధైర్యంగా ఉండేదని, ఇప్పుడు ఆ ధైర్యాన్ని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు ఆత్మహత్యలు, వ్యవసాయ సంక్షోభంపై మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి అధ్యక్షతన బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన రైతు అధ్యయన కమిటీ శనివారం నిజామాబాద్ జిల్లా మెండోర మండలం బుస్సాపూర్‌లో 2వ పేజీలో
కాంగ్రెస్ మాటలు నమ్మినం. ఆ పార్టీకి ఓటేసినందుకు ఇప్పుడు బాధపడుతున్నం. మళ్లీ పదేండ్ల కింది గోస అనుభవిస్తున్నం. రైతుబంధు వస్తలేదు.. పండిన పంట కొంటలేరు. పెట్టుబడి కోసం వ్యాపారుల దగ్గరికి పోతే 2 శాతం వడ్డీ అడుగుతున్నరు. లేదంటే పంటను వాళ్లకే అమ్మాలని షరతు పెడుతున్నరు. కేసీఆర్ ఉన్నప్పుడు మేమే ధర నిర్ణయించేటోళ్లం. ఇప్పుడు వ్యాపారులే ధర నిర్ణయించే పరిస్థితి వచ్చింది.
-వెంకట్‌రెడ్డి, రైతు, బుస్సాపూర్
పర్యటించింది. ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కమిటీ సభ్యులు అడిగి తెలుసుకున్నారు. ఒక్క బుస్సాపూర్ రైతులే కాకుండా చుట్టు పక్కల గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులు కూడా తమ బాధలు చెప్పుకొనేందుకు బుస్సాపూర్‌కు తరలివచ్చారు.
అధ్యయన కమిటీ ఎదుట రైతులు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు ఆశపడి మోసపోయినట్టు వాపోయారు. రైతుభరోసా 15 వేలు ఇస్తరని, 2 లక్షల రుణమాఫీ చేస్తరని ఆశపడ్డట్టు స్వయంగా రైతులే చెప్పారు. అప్పుడు ఓటేసిన పాపానికి ఇప్పుడు అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. మోసపూరిత హామీలిచ్చి ఓట్లు వేయించుకొని రేవంత్‌రెడ్డి గద్దెనెక్కారని మండిపడ్డారు,. కాంగ్రెస్ మోసం ఆలస్యంగా అర్థమైందని వాపోయారు. కేసీఆర్ ఉన్నప్పుడు దేనికీ లోటు లేకుండా ఉండేదని నాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. తుకాలు పోసేటప్పుడే ఠంచనుగా రైతుబంధు సాయం ఇచ్చేవారని తెలిపారు. కాంగ్రెస్ సర్కారులో అన్నీ అందని ద్రాక్షగానే మారాయని ఆవేదన వ్యక్తంచేశారు.
ఇప్పటికే వానకాలం రైతుభరోసాను ఎగ్గొట్టిన కాంగ్రెస్ సర్కారు.. ఇప్పుడు యాసంగి రైతుబంధు ఇస్తదో లేదోననే అనుమానం వ్యక్తంచేశారు. రుణమాఫీపై మాట్లాడుతూ సర్కారుపై ఇంతెత్తున లేశారు. ఆ గ్రామంలో 80 శాతం మంది రైతులకు రుణమాఫీ కాలేదని, 51 వేల మంది రైతులకు రుణమాఫీ కావాల్సి ఉంటే కేవలం 20 వేల మందికే అయిందని, ఇంకా 31 వేల మంది రైతులకు ప్రభుత్వం రుణమాఫీ ఎగ్గొట్టిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. పంటలకు సాగునీరు కూడా అందడం లేదని, గతంలో ఈ సమయానికి కేసీఆర్ కాళేశ్వరం నీళ్లతో చెరువులు, కుంటలు నింపితే ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు ఎండబెడుతున్నదని మండిపడ్డారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియడం లేదని, లో ఓల్టేజీతో మోటర్లు కాలిపోతున్నాయని, వాటిని రీపేర్ చేయించినప్పుడల్లా 10 వేల దాకా ఖర్చవుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో మోసపోయిన తాము మళ్లీ మోసపోయేందుకు సిద్ధంగా లేమని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ సర్కారుపై ఏడాదిలోనే విరక్తి పుట్టిందంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ పార్టీని గద్దె దించేవరకు రైతులమంతా కలిసి పోరాడుతామని తేల్చిచెప్పారు. ఇప్పుడు మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నందున పథకాల పేరుతో కాంగ్రెస్ హంగామా చేస్తున్నదని, మరోసారి రైతులను, ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్తామని తేల్చిచెప్పారు.
కాంగ్రెస్, కేసీఆర్ పాలనను పోల్చిచూపిన రైతులు, తమకోసం కేసీఆర్ చేసిన పనులను గుర్తు చేసుకుంటూ ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు. కేసీఆర్ ఉన్నప్పుడు కొండంత ధైర్యంగా ఉండేదని, ఇప్పుడు ఆ ధైర్యం కోల్పోయామని ఆవేదన వ్యక్తంచేశారు. పంట పండించటం నుంచి అమ్ముకునే వరకు అన్ని విధాలా రైతులకు కేసీఆర్ అండగా నిలిచారని, ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని వాపోయారు. ‘చెట్టు పెట్టి నీడనిచ్చే వ్యక్తి కేసీఆర్ అయితే.. ఆ చెట్టును నరికి పొయ్యిలో పెట్టే వ్యక్తి రేవంత్‌రెడ్డి’ అంటూ ఓ రైతు వ్యాఖ్యానించారు. అదే విధంగా ‘వద్దురా రేవంత్ వద్దురా.. మన కేసీఆరే ముద్దురా’ అంటూ కేసీఆర్‌పై తనకున్న ప్రేమను రైతు జైది సాయన్న పాటతో వ్యక్తపరిచారు.
అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ మాటలకు మోసపోయినం. కాంగ్రెసోళ్లు సుతం మోసపోయినమని అంటున్నారు. కాంగ్రెస్ చేసిన మోసాలపై అన్ని గ్రామాల్లో చర్చపెట్టాలి. ఒక్క సంవత్సరంలోనే కాంగ్రెస్ సర్కారుపై విరక్తి వచ్చింది. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు ఉన్నయి కాబట్టి మళ్లీ పథకాలని నాటకాలు ఆడుతున్నరు. మళ్ల మోసపోం. ఊర్లలో కాంగ్రెస్‌ను నిలదీస్తం.. బుద్ధి చెప్తం.
-నర్సారెడ్డి, రైతు, తోటపల్లి
ఉమ్మడి రాష్ట్రంలో నీళ్ల కోసం నా పొలంలో 38 బోర్లు వేసినా చుక్క నీరు రాలేదు. కానీ కేసీఆర్ సారు ఫుణ్యం, దయ వల్ల తోటపల్లి రిజర్వాయర్ నీళ్లు వచ్చినయి. బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు పదేండ్లలో నీళ్ల కోసం పైసా కూడా ఖర్చు చేయలేదు. ఇప్పుడు పాత రోజలు మళ్లీ వచ్చినయ్. తోటపల్లికి కాంగ్రెస్ సర్కారు నీళ్తిస్తలేదు. పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది.
– గడ్డం రాజశేఖర్‌రెడ్డి, రైతు, బుస్సాపూర్