e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, July 29, 2021
Home తెలంగాణ భూములు కబ్జా పెట్టొద్దంటే తప్పా?

భూములు కబ్జా పెట్టొద్దంటే తప్పా?

భూములు కబ్జా పెట్టొద్దంటే తప్పా?
  • పెత్తందారుల పార్టీ అని బీజేపీలో ఎట్ల చేరినవ్‌?
  • ఈటలపై ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ ఫైర్‌

హుజూరాబాద్‌, జూన్‌ 24: కోళ్ల ఫారంలో పని చేసుకుంటున్న ఈటలకు రాజకీయ ఓనమాలు నేర్పి, పెంచి పెద్ద చేసి అన్నం పెట్టిన సీఎం కేసీఆర్‌కు.. సున్నం పెట్టే ప్రయత్నం చేసిండని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ విమర్శించారు. గురువారం కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ పట్టణంలోని టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ ఈటలకు ఉద్యమ సమ యం నుంచి అనేక పదవులు కట్టబెట్టి రాష్ట్రంలోనే నంబర్‌-2 స్థానానికి తీసుకొచ్చారన్నారు. ‘మీరు చేసింది ఏం దో… కేసీఆర్‌ చేసింది ఏమిటో ప్రజల్లో చర్చ పె డుతాం. కేసీఆర్‌ ఏమైనా తప్పు మాట్లాడారా?.. దళితుల భూములు, బీసీల భూము లు కబ్జా పెట్టవద్దనడం తప్పా..?, అసైన్డ్‌ భూ ములు గుంజుకోవద్దనడం తప్పా..?, మంచిగుండాలని చెబితే తప్పేలా అవుతుంది’ అని బాల్క సుమన్‌ ప్రశ్నించారు. తప్పుల మీద తప్పులు చేసి కేసీఆర్‌ మీద దుమ్మెత్తి పోస్తే తెలంగాణ ప్రజలు నమ్మరనే విషయం ఈటల తెలుసుకోవాలని హితవు పలికారు. ‘బీజేపీ సిద్ధాంతాలు పేదోళ్లకు, దళితులకు, గిరిజనులకు, మైనార్టీలకు వ్యతిరేకం. అదొక్క పెత్తందారుల పార్టీ’ అని పదేపదే చెప్పిన ఈటల.. ఇప్పు డు అదే పార్టీలోకి ఎలా వెళ్లాడో చెప్పాలని సుమన్‌ డిమాండ్‌ చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడిన వీడియో క్లిప్పింగ్‌లను త్వరలోనే బయటపెడుతామన్నారు. దీనికి బీజేపీ నాయకులు కూడా సమాధానం చెప్పాలన్నా రు.

టీఆర్‌ఎస్‌ భారీ బైక్‌ ర్యాలీ
బాల్క సుమన్‌ పర్యటన సందర్భంగా టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో హుజూరాబాద్‌లో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. టీఆర్‌ఎస్వీ, టీఆర్‌ఎస్‌వై కార్యకర్తలు సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
భూములు కబ్జా పెట్టొద్దంటే తప్పా?
భూములు కబ్జా పెట్టొద్దంటే తప్పా?
భూములు కబ్జా పెట్టొద్దంటే తప్పా?

ట్రెండింగ్‌

Advertisement