వేములవాడ, ఏప్రిల్ 16: సీఎం రేవంత్‌కు తెలంగాణపై ఎలాంటి ఆత్మ లేదని, చంద్రబాబు పాలన ముద్ర మాత్రమే ఉందని మాజీ ఎమ్మెల్యే బాల సుమన్ విమర్శించారు. జగిత్యాలలో కేసీఆర్ సభ సన్నాహక సమావేశం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరుగగా, సభ ఇన్చార్జిగా ఆయన హాజరై మాట్లాడారు. ఈ నెల 20న జగిత్యాల జిల్లా సభకు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు.
వేములవాడకు కోట్లా ది నిధులు కేటాయించి అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి ఉందని గుర్తుచేశారు. 420 హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యే లు రాష్ట్ర ప్రజలను ఎకడికకడ గద్దల్లా పీక్కు తింటున్నారని ఆరోపించారు.
రెండున్నరేండ్లలో రేవంత్ రెడ్డి రూ.3లక్షల కోట్ల అప్పులు చేసి ఏమి అభివృద్ధి చేశాడో ప్రజలు నిలదీయాలని సూచించారు. తెలంగా ణ విభజనను ఇండి యా.. పాకిస్తాన్ మాదిరిగా జరిగిందని పార్లమెంటు సాక్షిగా కర్ణాటక ఎంపీ మాట్లాడిన తీరు బాధాకరమని పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి 8మంది బీజేపీ, 8మంది కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్లో ఉన్నా ఖండించకపోవడం వారికి తెలంగాణ మీద ఏ మేరకు ప్రేమ ఉందో తెలుస్తున్నదన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు, నాయకులు పాల్గొన్నారు.