కాంగ్రెస్ అభ్యర్థి వివేక్‌కు ఓటమి భయం
ఓటమి భయంతోనే చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రభుత్వ విప్, చెన్నూరు బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ విమర్శించారు.
- అందుకే దిగజారుడు మాటలు
- చెన్నూరు బీఆర్ఎస్ అభ్యర్థి బాల్కసుమన్
మంచిర్యాలటౌన్, నవంబర్ 22: ఓటమి భయంతోనే చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రభుత్వ విప్, చెన్నూరు బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ విమర్శించారు. బుధవారం మంచిర్యాలలోని బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే దివాకర్‌రావు నివాసంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మండలి చీఫ్ విప్ భానుప్రసాద్‌రావుతో కలిసి సుమన్ మాట్లాడారు. తండ్రి లాంటి కేసీఆర్‌పై వివేక్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చి, 1969లో సాధ్యం కాని తెలంగాణను ఢిల్లీ మెడలు వంచి సాధించిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని పేర్కొన్నారు. వివేక్ తండ్రి వెంకటస్వామి మరణించినప్పుడు ఆయన భౌతికకాయాన్ని గాంధీభవన్‌కు కూడా తీసుకురాకుం డా కాంగ్రెస్ అవమానించిందని తెలిపారు. కానీ సీఎం కేసీఆర్ వెంకటస్వామి విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై ప్రతిష్ఠించడమే కాకుండా ఆయన జయంతి.. వర్ధంతిలను అధికారికం గా నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. అలాంటి గొప్ప వ్యక్తిని దూషించడానికి వివేక్‌కు నోరెలా వచ్చిందని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో కేసీఆర్‌పై, తనపై అడ్డగోలుగా విమర్శిస్తున్నారని, ఫేక్ వీడియోలు, మార్ఫిం గ్ ఫొటోలతో దుష్ప్రచారం చేస్తున్నారని, అ యినా సంయమనంతో వ్యవహరిస్తున్నామని తెలిపారు. వివేక్, అతని కు టుంబ సభ్యులు, ఆయన సొంత మీడియాలో అడ్డగోలుగా ఆరోపణలు చేసినా సహిస్తున్నామని, ఈ దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని కోరారు.
ఐటీ, ఈడీ దాడులు బీజేపీ పనే..
బీజేపీ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్‌గా, పబ్లిసిటీ కమిటీ చైర్మన్‌గా ఉండి పార్టీకి వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్‌లో చేరిన వివేక్‌పై బీజేపీ కక్ష తీర్చుకుంటున్నదని మండలి చీఫ్‌విప్ భానుప్రసాదరావు అన్నారు. విశాఖ ఇండస్ట్రీస్ కార్యాలయాలపై, వివేక్ ఇండ్లపై ఐటీ, ఈడీ దాడులు బాల్కసుమన్, బీఆర్ఎస్ పనేనని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

