మీలా దొబ్బిపోయే నాలెడ్జ్ మాకు లేదు.. రాజగోపాల్‌రెడ్డికి చురకలంటించిన బాల్క సుమన్
నైని బొగ్గు బ్లాక్ విలువ 50 వేల కోట్లు ఉండదని, ఇలాంటిది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రూ.50 వేల కోట్ల కుంభకోణం జరిగిందని మాట్లాడటం
- సింగరేణిపై కాంగ్రెస్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన ప్రభుత్వ విప్
ప్రజల సంపద, ఆస్తులను దొబ్బిపొయే నాలెడ్జ్ (కొల్లగొట్టే తెలివి) తమకు లేదని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ కాంగ్రెస్ సభ్యుడు రాజగోపాల్‌రెడ్డికి చురకలంటించారు. సంపద పెంచడం.. ప్రజలకు పంచడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా కొంత మందికి పంచే కార్యక్రమం చేయబోమంటూ ఫైర్ అయ్యారు. సింగరేణి కాలరీస్ సంస్థ ప్రైవేటీకరణ, బొగ్గు గనుల వేలం అంశాలపై అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో వాడీవేడీ చర్చ జరిగింది. కాంగ్రెస్ సభ్యుడు రాజగోపాల్‌రెడ్డి ఆరోపణలపై బాల్క సుమన్ ఘాటుగా స్పందించి రాజ్‌గోపాల్‌రెడ్డి వ్యాఖ్యలను తిప్పికొట్టారు. సింగరేణి సంస్థ మన రాష్ట్రం దాటి ఇతర రాష్ర్టాలకు విస్తరిస్తే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెత్త ఆరోపణలు చేస్తున్నారని సుమన్ ఆరోపించారు.
నైని బొగ్గు బ్లాక్ విలువ 50 వేల కోట్లు ఉండదని, ఇలాంటిది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రూ.50 వేల కోట్ల కుంభకోణం జరిగిందని మాట్లాడటం సబబుకాదన్నారు. సభను తప్పుదోవ పట్టించరాదని సూచించారు. ఆ తర్వాత సుమన్ కేంద్రం తీరును తప్పుబట్టారు. కేంద్రం తెలంగాణపై, సింగరేణిపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిగ్నైట్ మైన్స్‌ను కావాలని లేఖ రాస్తే కేటాయించిన కేంద్రం, మంత్రి కేటీఆర్ లేఖ రాస్తే స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ నాలుగు బ్లాక్‌లు పోగా, త్వరలోనే మరో 14 బ్లాక్‌లను వేలం వేసే ప్రమాదముందన్నారు. ఐరన్ గనులను విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ఇవ్వకుండా నష్టాల బాట పట్టించి, ప్రైవేటీకరిస్తున్న కేంద్రం, అదే తరహాలో సింగరేణిని ప్రైవేటీకరించబోతోందని ఆరోపించారు. డీఎంఎఫ్ నిధులను కోల్‌బెల్ట్ ప్రాంతంలో ఖర్చుచేయాలని సుమన్ ప్రభుత్వాన్ని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

