ధర్పల్లి, అక్టోబర్ 10 : గత ఎన్నికల్లో బీసీలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ లబ్ధి పొందాలని చేసిన కుట్రలు పటాపంచలయ్యాయని ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. శుక్రవారం నిజామాబాద్‌లోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ..ఢిల్లీలో కొట్లాడాల్సిన రేవంత్‌రెడ్డి.. గల్లీలో కొట్లాడుతున్నట్టు డ్రామా క్రియేట్ చేశారు తప్ప, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధించడానికి చిత్తశుద్ధి ప్రదర్శించలేదని విమర్శించారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు చట్టబద్ధత కోసం కేంద్రాన్ని పట్టుబట్టాల్సిన రేవంత్‌రెడ్డి తెలివిగా దాన్ని పక్కదోవ పట్టించారని మండిపడ్డారు. పార్లమెంట్లో చట్టం చేయించి, షెడ్యూల్ 9 లో చేర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ తప్పిదం, రాజకీయ స్వార్థంతోనే 42శాతం బీసీ రిజర్వేషన్లకు వి ఘాతం కలిగిందని బీసీ కమిషన్ మాజీ చైర్మన్, బీజేపీ నేత వకుళాభరణం కృష్ణమోహన్ విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కోటాపై అడుగడుగునా తప్పిదాలకు పాల్పడిందని ఆరోపించారు. తప్పులతడకగా కులగణన సర్వే నిర్వహించిందని పేర్కొన్నారు. హైకోర్టు ఎదుట సరైన వాదనలు వినిపించకపోడంతోనే జీవో-9పై స్టే వచ్చిందని చెప్పారు.
హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలను ప్రధానమంత్రి, రాష్ట్రపతి వద్దకు తీసుకెళ్లాలని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రభుత్వానికి సూచించారు. శుక్రవారం మగ్దూంభవన్ ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో వారు మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల అంశంపై ఢిల్లీలోని జంతర్ వద్ద ధర్నా నిర్వహించాలని డిమాండ్‌చేశారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పాల్గొన్నారు.