హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): బడిబాట కార్యక్రమాన్ని జూలై ఆరో తేదీ వరకు పొడిగించినట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన తెలిపారు. బడిబాట కార్యక్రమాన్ని తొలుత ఈ నెల 3 నుంచి 17 వరకు నిర్వహించారు. ఈ నెల 26 నుంచి జూలై 6 వరకు బడిబాటను కొనసాగించాలని, ఈ రోజుల్లో ఎన్రోల్మెంట్ డ్రైవ్‌ను చేపట్టాలని తాజాగా ఆదేశించారు. ఈ నెల 17 వరకు నిర్వహించిన బడిబాటతో రాష్ట్రవ్యాప్తంగా 1,91,557 మంది విద్యార్థులు కొత్తగా ప్రవేశాలు పొందారు.