హైదరాబాద్, జూన్3 (నమస్తే తెలంగా ణ): భద్రాచలం వద్ద ఊహించని రీతిలో వర ద ప్రభావం ఉంటున్నదని, ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రభావాన్ని ఈ ఏడాది కూడా అధ్యయనం చేయాలని తెలంగాణ సర్కారు డిమాండ్ చేసింది. రివర్స్ క్రాస్ సెక్షన్లను కొత్తగా సర్వే చేయించాలని కోరింది. ఈ మేరకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జలసంఘానికి రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్ సోమవారం లేఖ రాశారు. నిరుడు అనుభవాల నేపథ్యంలో రక్షణ చర్యలు చేపట్టేవరకూ ప్రాజెక్టు స్లూయిస్ గేట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ మూసి ఉంచవద్దని కోరారు.