OU PhD | ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ కామర్స్ విభాగంలో బి. గట్టయ్య డాక్టరేట్ సాధించారు. ప్రొఫెసర్ డి. చెన్నప్ప పర్యవేక్షణలో ‘ఇ-నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ ఇన్ తెలంగాణ – ఎ స్టడీ ఆఫ్ సెలెక్ట్ డిస్ట్రిక్ట్స్ ఇన్ తెలంగాణ స్టేట్’అనే అంశంపై గట్టయ్య పరిశోధన చేసి, సమర్పించిన పరిశోధనా గ్రంథాన్ని పరిశీలించిన ఓయూ ఎగ్జామినేషన్ బ్రాంచి అధికారులు ఆయనకు పీహెచ్డీ పట్టాను ప్రదానం చేస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం ఆయన హన్మకొండ జిల్లా భీమారంలోని ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు అధ్యాపకులు, కళాశాల యాజమాన్యం అభినందించారు.