హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): పదోతరగతి ఫలితాల్లో భాష్యం విద్యాసంస్థలు విజయభేరి కొనసాగించినట్టు హైదరాబాద్ భాష్యం జోనల్ హెడ్ బీ అంకమ్మరావు తెలిపారు. 185 మంది భాష్యం విద్యార్థులు 10 జీపీఏ సాధించి చరిత్ర సృష్టించారని వెల్లడించారు. 392 మందికిపైగా విద్యార్థులకు 9.8జీపీఏ, 583 మందికి 9.7, 775 మందికి 9.5, 1,327 మంది విద్యార్థులు 9 జీపీఏ సాధించారని పేర్కొన్నారు.
మొత్తం 10,428 మంది విద్యార్థులు ‘ఏ’ గ్రేడ్లు కైవసం చేసుకొన్నారని చెప్పారు. విద్యార్థుల శ్రమ, ఉపాధ్యాయుల కృషి ఫలితంగానే ఇలాంటి అద్భుత విజయాలు సాధించామని తెలిపారు. విద్యార్థులకు, ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బందిని భాష్యం విద్యాసంస్థల చైర్మన్ రామకృష్ణ అభినందించారు.