 
                                                            హైదరాబాద్, అక్టోబర్ 30(నమస్తే తెలంగాణ) : అజారుద్దీన్‌కు మంత్రి పదవి కంటితుడుపు చర్యేనని, దానితో ఇప్పుడు ముస్లింలకు ఒరిగేదేమీ లేదని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు షేక్ అబ్దుల్లా సోహైల్ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. మంత్రివర్గంలో మైనారిటీల ప్రాతినిధ్యం లేకపోవడంపై బీఆర్ఎస్ పదేపదే ప్రభుత్వాన్ని కార్నర్ చేయడంతో కాంగ్రెస్ ఒత్తిడికిలోనై అజారుద్దీన్‌కు మంత్రి పదవి కట్టబెట్టిందని స్పష్టంచేశారు.
ప్రభుత్వం ఏర్పడిన రెండేండ్లకు క్యాబినెట్లో చోటుకల్పించకపోవడం మైనారిటీలను అవమానించడమేనని తెలిపారు. మంత్రివర్గంలో మైనారిటీల ప్రాతినిధ్యం లేకపోవడంతో ముస్లిం బస్తీల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం కూడా చేయలేని పరిస్థితి నెలకొన్నదని, దీంతో చేసేదిలేక అజారుద్దీన్‌కు మంత్రిపదవి ఇచ్చినట్టు పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించి ఆ పార్టీకి బుద్ధిచెప్పాలని ఓటర్లకు విజ్ఞప్తిచేశారు. మైనారిటీల సంక్షేమం కోసం పాటుపడే బీఆర్ఎస్ను అఖండ మెజార్టీతో గెలిపించాలని సోహైల్ కోరారు.
 
                            