‘పది’ విద్యార్థులకు ఆయుష్ కిట్
పదో తరగతి విద్యార్థుల కోసం ఆయుష్ విభాగం వినూత్న కార్యక్రమం చేపట్టింది. వార్షిక పరీక్షలు రాసే పదోతరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపింది. పరీక్షల వేళ విద్యార్థుల మేధోశక్తిని, పఠన సామర్థ్యాన్ని పెంచేందుకు, ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రత్యేక కిట్‌ను రూపొందించింది.
- మేధోశక్తి, పఠన సామర్థ్యం పెరిగేలా ఔషధాలు
- రాష్ట్రవ్యాప్తంగా 400 బడుల్లో పంపిణీ
- సత్ఫలితాలు వస్తే వచ్చే ఏడాది విస్తృతం
హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): పదో తరగతి విద్యార్థుల కోసం ఆయుష్ విభాగం వినూత్న కార్యక్రమం చేపట్టింది. వార్షిక పరీక్షలు రాసే పదోతరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపింది. పరీక్షల వేళ విద్యార్థుల మేధోశక్తిని, పఠన సామర్థ్యాన్ని పెంచేందుకు, ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రత్యేక కిట్‌ను రూపొందించింది. ఇందులో ఆయుర్వేద, యునాని, హోమియోపతి మందులు కలిపి ఉన్నాయి. ఈ కిట్లను తొలిదశలో రాష్ట్రవ్యాప్తంగా 400 పాఠశాలలో పంపిణీ చేస్తున్నారు. సత్ఫలితాలు వస్తే వచ్చే సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తున్నారు. నెలకు సరిపడ మందులను విద్యార్థులకు అందజేస్తున్నారు. పరీక్షల వేళ ఒత్తిడికి గురి కాకుండా ఎలా ఉండాలో, ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో సలహాలు, సూచనలు ఇస్తున్నారు. సూర్య నమస్కారాలు, వాటి ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తున్నారు. కిట్‌తోపాటు విద్యార్థులకు రాగిలడ్డూ కూడా అందిస్తున్నారు.
కిట్‌లో ఏమున్నాయి..
1) బ్రహ్మీ గ్రాన్యూల్స్ (ఆయుర్వేదం)
2) మజున్-ఇ-ఫల్సఫా (యునాని)
3) ఆల్ఫా ఆల్ఫా సిరప్ (హోమియోపతి)
4) ఫెర్రమ్ ఫోస్ 6ఎక్స్ ట్యాబ్లెట్లు(హోమియోపతి)
ఉపయోగం..
- బ్రహ్మీ గ్రాన్యూల్స్: దీనిని ‘మేధ్య రసాయన’ అని పిలుస్తారు. ఇది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను పెంచుతుంది. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
- మజున్-ఇ-ఫల్సఫా: మానసిక శక్తిని పెంపొందిస్తుంది. శరీర అవయవాలను బలోపేతం చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
- ఆల్ఫా ఆల్ఫా సిరప్: ఆకలిని పెంచుతుంది. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. శారీరక పెరుగుదలకు సహకరిస్తుంది.
- ఫెర్రమ్ ఫోస్: గాయాలయినప్పుడు రక్తస్రావాన్ని తగ్గిస్తుంది. జ్వరం, దగ్గు, గొంతునొప్పి, తలనొప్పి వంటివాటి నుంచి ఉపశమనం కల్పిస్తుంది.
దుష్ప్రభావాలు ఉండవు
ఆయుర్వేదం, యునాని, హోమియోపతి వంటివి మన పురాతన వైద్య విధానాలు. వీటివల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. విద్యార్థులు పరీక్షల సమయంలో ఒత్తిడికి లోనుకాకుండా, మరింత సమర్థంగా పరీక్షలు రాసేలా ఈ కిట్‌ను అందిస్తున్నాం. వారి మేధోశక్తిని పెంచేందుకు ఇది సాయం చేస్తుంది.
– ఆయుష్ విభాగం డైరెక్టర్, ప్రశాంతి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘శ్రీకృష్ణం వందే జగద్గురుం’ కోలాట బృందానికి జాతీయ పురస్కారం
AP News | దక్షిణ బీహార్‌లా ఆంధ్రప్రదేశ్.. కూటమి సర్కారుపై వైఎస్ షర్మిల ఫైర్
‘నీటిని, కరెంటును పొదుపుగా వాడాలి’
కేతావత్ చంద్రు మృతి బాధాకరం : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
AP News | అధిష్టానాన్ని దిక్కరించి అభ్యర్థిని ప్రకటించుకున్న టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

