హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): నీట్ యూజీ పరీక్షపై ఈ నెల 10 నుంచి 12 వరకు ఉచిత అవగాహన సదస్సు నిర్వహించనున్నట్టు మెటా మైండ్ అకాడమీ డైరెక్టర్ ఏ మనోజ్‌కుమార్ తెలిపారు. రిటైర్డ్ ఐఏఎస్ బీపీ ఆచార్య, ప్రొఫెసర్ చింతా గణేశ్, గంప నాగేశ్వర్రావు సదస్సు పోస్టర్‌ను సోమవారం ఆవిష్కరించారు.
నెక్ట్స్ డాక్టర్స్ సంస్థ భాగస్వామ్యంతో సదస్సు నిర్వహిస్తున్నామని, మూడు రోజులపాటు హాస్టల్ వసతి కల్పిస్తున్నట్టు చెప్పారు. రిజిస్ట్రేషన్ కోసం 90908 98928, 89777 58172 నంబర్లను సంప్రదించాలని సూచించారు.