హైదరాబాద్ : ప్రజలకు గ్లూకోమ గురించి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో సండే మార్చ్ ర్యాలీని చేపట్టామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం నగరంలోని సరోజిని దేవి కంటి దవాఖానలో వరల్డ్ గ్లూకోమ డే వారోత్సవాలు నిర్వహించారు . ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సండే మార్చ్ ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా 40 సంవత్సరాలు దాటి బీపి, షుగర్ ఉన్నవాళ్లలో 3 శాతం మంది గ్లూకోమా బారిన పడుతున్నారు.
ఇలా వ్యాధి బారిన పడిన వారిలో పది శాతం కంటి చూపును కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాధి వచ్చినట్లు అర్థం కాదు. చివరకు కంటి చూపును కోల్పోతారన్నారు. ఈ వ్యాధిపై అవగాహన పెంచుకోవడంతో పాటు ప్రతి ఏడాది కంటి పరీక్షలు జరుపుకోవాలన్నారు. సరోజిని దేవి కంటి దవాఖాన పై త్వరలో సమీక్ష సమావేశం నిర్వహిస్తానున్నారు.ప్రపంచంలోనే ‘కంటి వెలుగు’ లాంటి కార్యక్రమం ద్వారా ప్రజలకు కంటి పరీక్షలు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే చెందుతుంది.
కేసీఆరే కిట్ ద్వారా ప్రభుత్వ దవాఖానల్లో పెద్ద ఎత్తున్న ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగాయన్నారు. కరోనా సమయంలో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది అద్భుతంగా పని చేశారని ప్రశంసించారు. అక్కడక్కడ వృత్తిలో ప్రాణాలను కూడా కొల్పోయారు.ఇప్పటి వరకు 45 కోట్ల రూపాయలను చని పోయిన వారి కుటుంబాలకు అందించామన్నారు.
కంటి వెలుగు ద్వారా 5 నెలలు కోటి 50 లక్షల మందికి కంటి పరీక్షలు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదన్నారు. కాగా, కరోనా సమయంలో వైద్య సేవలు అందిస్తూ మరణించిన ఏఎన్ఎం వరలక్ష్మి కుటుంబానికి 50 లక్షలు రూపాయల ఇన్సూరెన్స్ చెక్‌ను మంత్రి అందించారు.