హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): గ్రామాలు, వ్యవసాయ పొలాల్లో విద్యుత్తు ఫెన్సింగ్‌లు ఏర్పాటు చేయకుండా చూడాలని, ఉన్నవాటిని తొలగించాలని పంచాయతీరాజ్‌శాఖను అటవీ శాఖ కోరిం ది. కరెంటు ఫెన్సింగ్‌లతో మనుషులు ప్రమాదాలకు గురై చనిపోతున్నందున వెంటనే వాటిని తొలగించాలని కోరుతూ అటవీ అధికారులు లేఖ రాశారు. పులు లు, ఇతర క్రూరమృగాల నుంచి రక్షణగా పలువురు రైతులు, ప్రజలు తమ పొలాలు, ఇండ్ల చుట్టు విద్యుత్తు ఫెన్సింగ్‌లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రభుత్వం నష్టపరిహారం పెంచినట్టు అధికారులు పేర్కొన్నారు.