ATS | హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): ప్రజా, సరకు రవాణా వాహనాల తనిఖీలకు ఆటోమేటెడ్ వాహన ఫిట్నెస్ కేంద్రాలు(ఏటీఎస్) అందుబాటులోకి రానున్నాయి. పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో వాహనాల ఫిట్‌నెస్‌పై రవాణా శాఖ దృష్టి సారించింది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ నలువైపులా నాలుగు కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళికలను సిద్ధం చేసింది. సికింద్రాబాద్, నాగోల్, ఉప్పల్, కొండాపూర్ ప్రాంతాల్లో సెంటర్లను నిర్వహించేందుకు యోచిస్తున్నది. ఒక్కో కేంద్రానికి రూ.8 కోట్ల వరకు ఖర్చు చేయనున్నది.
ఆటోలు, బస్సులు, మినీ బస్సులు, ట్రావెల్ బస్సులు, ఇతర రవాణా వాహనాలు ఏటా ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ తనిఖీలను మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్లు మ్యానువల్‌గా చేస్తుండగా సక్రమంగా సాగడం లేదనే ఆరోపణలున్నాయి. దీంతో తరచూ ప్రమాదాలు జరిగి అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. పాఠశాలల బస్సులకు సైతం సక్రమంగా ఫిట్నెస్ పరీక్షలు జరగటం లేదన్న విమర్శలూ వస్తున్నాయి.
ఆటోమొబైల్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ) నిబంధనలకు అనుగుణంగా వాహన ఏటీఎస్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఆటోమేటెడ్ కేంద్రాల్లో వాహనాల టైర్ల నుంచి బ్రేకుల వరకు కంప్యూటర్లే పూర్తిగా విశ్లేషిస్తాయి. ఎలక్ట్రికల్, మెకానికల్ లోపాలను ఇట్టే పసిగట్టేస్తాయి. పొల్యూషన్ అండ్ కంట్రోల్ (పీయూసీ) ధ్రువీకరణ అర్హత ఉన్నది లేనిదీ ఆటోమేషన్‌లోనే గుర్తించి నివేదిక ఇస్తాయి.
ఒక్కో కేంద్రంలో గంటకు 25 నుంచి 30 వాహనాల వరకు తనిఖీలు నిర్వహించేలా తీర్చిదిద్దుతున్నారు. తనిఖీ అనంతరం వాహన ఫిట్‌నెస్‌పై కంప్యూటర్లే ఆటోమేటిక్‌గా స్కోరును అందిస్తాయి. దీంతో సరైన ఫిట్నెస్ లేని వాహనాలు రోడ్డుపైకి రాకుండా అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుంది.
ప్రతిడిజిటల్ అరెస్టులపై అవగాహన
హైదరాబాద్, (నమస్తే తెలంగాణ): డిజిటల్ అరెస్టులపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్టు టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయెల్ చెప్పారు. రాష్ట్రవ్యాప్తం గా బుధవారం అవగాహన ర్యాలీ నిర్వహించినట్టు తెలిపారు.