ములుగు : కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత బస్(Free bus) సౌకర్యం వల్ల ఆటో డ్రైవర్ల(Auto drivers) కుటుంబాలు రోడ్డున పడతాయని ఆటో యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించడం వల్ల తాము నష్టపోతున్నామని, తక్షణమే ఆటో నడుపుకొని బతికే మాకు ప్రభుత్వమే మార్గం చూపాలని డిమాండ్ చేస్తూ మంగపేట మండల కేంద్రంలో ఆటో యూనియన్ల ఆధ్వర్యంలో ధర్నా(Dharna) చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టడం గొప్ప విషయమే అయినప్పటికీ వాహన రంగంపై ఆధారపడిన డ్రైవర్ల బతుకులు రోడ్డున పడుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. వాహన రంగ కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందన్నారు.