హిమాయత్ నగర్,ఫిబ్రవరి12: కాంగ్రె స్ ప్రభుత్వం ఆటోడ్రైవర్లకు తీవ్ర అన్యా యం చేసిందని తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ జేఏసీ నేతలు మండిపడ్డారు. బుధవారం హిమాయత్‌నగర్‌లోని సత్యనారాయణరెడ్డిభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ నేతలు మాట్లాడారు. ఇందులో బీ వెంకటేశం(ఏఐటీయూసీ), పీ శ్రీకాంత్(సీఐటీయూ), ఎంఏ సలీం, ఎండీ నజీర్(యూటీఏడబ్ల్యూఏ), నిరంజన్(బీఆర్టీయూ), వీ ప్రవీణ్(టీయూసీఐ), రాంరెడ్డి(ఐఎఎఫ్యూ) ఉన్నారు.
తమ సమస్యలను పరిష్కరించాలని ఈనెల 15వ తేదీన నారాయణగూడ ఫ్లైఓవర్ కింద ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం, 24న బాగ్‌లింగంపల్లిలోని సుం దరయ్య విజ్ఞాన కేంద్రంలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. తమ సమస్యలు పరిష్కరిస్తామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎనిమిది నెలలుగా చర్చల పేరిట కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే ఎం తో మంది ఆటోడ్రైవర్లు బలవన్మరణాలకు పాల్పడ్డారని, అయినా ప్రభుత్వంలో చల నం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రెం డు కార్యక్రమాల్లో ఆటో డ్రైవర్లు అధిక సం ఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జేఏసీ నేతలు సీహెచ్ జంగయ్య, ఎస్ అశోక్, ఎం శ్రీనివాస్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.