హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 20 ( నమస్తే తెలంగాణ ): ఆటోడ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం మద్దతుగా వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై హనుమకొండ లో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని బీఆర్టీయూ రాష్ట్ర ఆటో యూనియన్ అధ్యక్షుడు వేముల మారయ్య, ఏఐటీయూసీ నాయకుడు వెంకటేశం ఆగ్రహం వ్యక్తం చేశారు. నాచారంలో వారు మాట్లాడుతూ ఆటోడ్రైవర్ల ఆత్మహత్యలపై మాట్లాడే సమయం లేని సీఎంకు కేటీఆర్ వేసుకున్న డ్రైవర్ల(ఖాకీ)చొక్కాపై విమర్శలు చేయడానికి మాత్రం సమయం ఉన్నదని విమర్శించారు.
డ్రైవరన్నల జీవితాలను బలితీసుకుంటున్న కాంగ్రెస్ సర్కార్‌కు బుద్ధి చెబుతామని హెచ్చరించారు.బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ రాష్ట్ర ఆటోడ్రైవర్ల రాష్ట్రసదస్సు గురువారం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అన్ని సంఘాల ప్రధాన నాయకులు పాల్గొంటారని, అక్కడే తమ ఉద్యమ కార్యాచరణపై చర్చిస్తామని పేర్కొన్నారు.