రేవంత్.. తీరు మార్చుకో..!
సీఎం రేవంత్‌రెడ్డీ నీ వైఖరి మార్చుకో.. డ్రైవరన్నల ఆత్మహత్యలపై స్పందించాలి.. ఆటో డ్రైవర్లకు నెలకు రూ.15 వేలు చెల్లించాలి.. డౌన్ డౌన్ రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్ నిరంకుశ విధానాలు నశించాలి.. అన్న నినాదాలు హోరెత్తాయి.
- కార్మికుల ఆత్మహత్యలు కనిపించడం లేదా?
- గద్దెనెక్కిన తర్వాత హామీలను వదిలేస్తావా?
- ఆటోడ్రైవర్ల ఆగ్రహం.. రాష్ట్ర బంద్ విజయవంతం
- జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీలు
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మల దహనం
నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఫిబ్రవరి 16: సీఎం రేవంత్‌రెడ్డీ నీ వైఖరి మార్చుకో.. డ్రైవరన్నల ఆత్మహత్యలపై స్పందించాలి.. ఆటో డ్రైవర్లకు నెలకు రూ.15 వేలు చెల్లించాలి.. డౌన్ డౌన్ రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్ నిరంకుశ విధానాలు నశించాలి.. అన్న నినాదాలు హోరెత్తాయి. శుక్రవారం రాష్ట్రవ్యాప్త ఆటోల బంద్ కార్యక్రమంలో భాగంగా టీఏటీయూ, సీఐటీయూ, ఏఐటీసీ తదితర సంఘాలతో కూడిన ట్రాన్స్పోర్ట్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ నగరంలో ఆటో డ్రైవర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి నారాయణగూడ చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలను డ్రైవర్లు దహనం చేశారు. ఆటోడ్రైవర్లను ఆదుకోండి.. అన్న ప్లకార్డులను ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదా లు చేశారు. అనంతరం ఒక్కసారిగా ఆటోడ్రైవర్లు రోడ్డుపై బైఠాయించే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకు న్నా రు. రాష్ట్ర వ్యాప్తంగా 25 మందికి పైగా డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నా సీఎం రేవంత్‌రెడ్డి కనికరించలేదని టీఏటీయూ ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐటీయూసీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ బి కృష్ణమూర్తి, తెలంగాణ క్యాబ్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో సంపూర్ణంగా ఆటోల బంద్ జరిగింది. ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండల కేంద్రంలోని శివాజీ చౌరస్తా వద్ద తమ కు టుంబ సభ్యులతో కలిసి డ్రైవర్లు ధర్నా చేశా రు. నిజామాబాద్ నగరంలో ఆటోవాలాలు ఆటోలు నిలిపివేసి ర్యాలీలు నిర్వహించారు.
మహిళలకు నగదు ఇవ్వాలి: బోయినపల్లి
మహిళలకు జీరో టికెట్‌కు బదులు వారి ప్రయాణానికి ప్రభుత్వం నగదు చెల్లించాలని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ ప్రభుత్వానికి సూచించారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో ఆటో డ్రైవర్లు చేపట్టిన బంద్‌కు మద్దతు పలికారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

