హుస్నాబాద్ రూరల్, డిసెంబర్ 10: అప్పుల బాధ తో ఆటోడ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలో చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల వివరాల ప్రకారం.. పొట్లపల్లికి చెందిన బండి శ్రీధర్గౌ డ్(30) ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు పథకంతో ఆ టోసరిగా నడవకపోవడం, కొన్ని నెలలు గా ఆటోకు కిస్తీలు చెల్లించకపోవడంతో ఫైనాన్స్ నుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో మనోవేదనకు గురైన శ్రీధర్ సోమవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకున్నాడు. మృతుడికి భార్య సౌమ్య, కుమారుడు ఉన్నా రు. కాగా మృతుడు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందినవాడు కావడం గమనార్హం.