ఖానాపూర్ : భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గోదావరి పరివాహక వాసులకు (Godavari catchment area) అధికారులు అప్రమత్తం ( Alert ) చేస్తున్నారు. ముఖ్యంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్( Khanapur) , కడెం ( Kadem ) మండలాల ప్రజలు గోదావరి పరివాహక ప్రాంతాలకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని ఖానాపూర్ ఎంపీవో చిక్యాల రత్నాకర్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు.
మండలంలోని సుర్జాపూర్, బాదనకుర్తి, చింతల్ పేట్, మస్కాపూర్ గ్రామాల్లో పర్యటించి రైతులు, మత్సకారులు, ప్రజలకు పలు సూచనలు చేశారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని మైకు ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. ఆయన వెంట ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, నీటి పారుదల శాఖ అధికారులు ఉన్నారు.