చేర్యాల, ఏప్రిల్ 12 : సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో ఈనెల 18న సీల్డు టెండర్ కమ్ బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో ఎ.బాలాజీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దేవాలయం షాపింగ్ కాంప్లెక్స్‌లోని షాప్‌ల్లో తాత్కాలిక లైసెన్స్ పద్ధతిపై వ్యాపారం చేసుకునే హక్కులు, ప్రసాదాల తయారీ, ప్యాకింగ్ నిర్వహణకు టెండర్లు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఆలయంలో ప్రైవేటు సెక్యూరిటీ నిర్వహణకు సైతం టెండర్లు నిర్వహిస్తున్నామని, ఆసక్తిగల వారు ఆలయ నియమ,నిబంధనల మేరకు సీల్డు టెండర్‌తో పాటు బహిరంగ వేలం పాటల్లో పాల్గొనాలని కోరారు. దేవాలయం షాపింగ్ కాంప్లెక్స్ వేలంలో పాల్గొనేందుకు రూ.30వేలు, ప్రసాదాల తయారీ, ప్యాకింగ్ నిర్వహణకు రూ.25వేలు, ప్రైవేటు సెక్యూరిటీ రూ.10వేల డీడీ తీయాలని సూచించారు.