హైదరాబాద్, జూలై 20 (నమస్తే తె లంగాణ): వివిధ రాష్ర్టాల్లోని కొత్త క్రిటిక ల్, స్ట్రాటజిక్ గనులను త్వరలో వేలం వే యనున్నట్టు కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఇందుకోసం అ రుణాచల్‌ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, క ర్ణాటక, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాల్లో 10 మినరల్ బ్లాక్‌లను ఎంపిక చేసినట్టు తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ‘మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ హ్యాకథాన్, క్రిటికల్ మినరల్ రోడ్‌షో’లో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 373 మినరల్ బ్లాక్స్ వేలం పూర్తయిందని, మరో 24 క్రిటికల్ అండ్ స్ట్రాటజికల్ బ్లాక్‌లను వేలం వేయాలని నిరుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని వివరించారు.