హైదరాబాద్ : దేశంలోనే అతి పెద్ద 125 అడుగులతో నిర్మించిన రాజ్యాంగ నిర్మాణ అంబేద్కర్ విగ్రహావిష్కరణ(Ambedkar statue)కు బీఆర్ఎస్ శ్రేణులు(Brs members) పెద్ద సంఖ్యలో తరలిరావాలని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) పిలుపునిచ్చారు. శుక్రవారం
తెలంగాణ భవన్ లో హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్(BRS )ముఖ్యుల సమావేశంలో మంత్రి మాట్లాడారు.
భారత దేశం గర్వపడే విధంగా అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించిన గొప్ప మానవతావాది సీఎం కేసీఆర్(CM KCR) అని ప్రశంసించారు. విగ్రహావిష్కరణ రోజున హైదరాబాద్ జంట నగరాల్లోని 15 నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు ర్యాలీగా బయలు దేరి సభాస్థలికి చేరుకుంటారని ఆయన వెల్లడించారు. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు హైదరాబాద్ సిటీలో ఉత్సహంగా జరుగుతున్నాయని తెలిపారు. మరో 10,15 రోజుల్లో సమ్మేళనాలు పూర్తవుతాయని , 25వ తేదీన రాష్ట్రస్థాయి సమావేశం జరుగుతుందని తెలిపారు.
ఆత్మీయ సమ్మేళనంలో 2014 కంటే ముందు, తరువాత జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై కులంకషంగా చర్చ జరిగిందన్నారు. ఈ సమావేశంలో హోంమంత్రి మహమూద్ అలీ, జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్, ఇన్చార్జి దాసోజు శ్రవణ్, మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, ఎమ్మెల్యే లు ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, కార్పొరేషన్ చైర్మన్ లు గజ్జెల నగేష్, విప్లవ్ కుమార్, రావుల శ్రీధర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ శ్రీలత, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రసన్న, వివిధ నియోజకవర్గాల ఇన్చార్జిలు పాల్గొన్నారు.