నిజాంసాగర్, ఫిబ్రవరి 13 : తనకు రేషన్‌కార్డు రాకుండా కొందరు నాయకులు అడ్డుపడుతున్నారని కామారెడ్డి జిల్లా ని జాంసాగర్ తహసీల్ కార్యాలయం ఎదుట ఓ యువకుడు గురువారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మల్లూర్కు చెందిన గ డ్డమీది సందీప్‌గౌడ్ (29) ప్రజాపాలనలో కొత్త రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఆరేండ్ల క్రితం వివాహం చేసుకున్న అతడు.. వేరు కాపురం పెట్టాడు. రేషన్‌కార్డు రా కుండా కొందరు నాయకులు అడ్డుపడుతున్నారని ఆవేదనకు గురైన అతడు.. గురువా రం నిజాంసాగర్ తహసీల్ కార్యాలయం ఎ దుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు య త్నించాడు. పోలీసులు వచ్చి సందీప్‌ను అ దుపులోకి తీసుకున్నారు. తహసీల్దార్ భిక్షపతి.. బాధితుడితో మాట్లాడి రేషన్ కార్డు వ చ్చేలా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.