నిమ్స్ దవాఖాన ఆవరణలో దారుణం
ఖమ్మంలో ఓ మైనర్‌పై అమానుష ఘటనను మరువక ముందే నిమ్స్‌లో మరో దారుణ ఘటన చో టుచేసుకొన్నది. పంజాగుట్ట పోలీసుల కథనం ప్రకారం.. నిమ్స్ దవాఖాన ప్రాంగణం లో నూతన భవనాల నిర్మాణం జరుగుతున్నది.
- నిర్మాణంలో ఉన్న భవనం వద్ద బాలికపై లైంగికదాడికి యత్నం
- నిందితుడిపై పోక్సో కేసు నమోదు
ఖైరతాబాద్, జూన్ 12: ఖమ్మంలో ఓ మైనర్‌పై అమానుష ఘటనను మరువక ముందే నిమ్స్‌లో మరో దారుణ ఘటన చో టుచేసుకొన్నది. పంజాగుట్ట పోలీసుల కథనం ప్రకారం.. నిమ్స్ దవాఖాన ప్రాంగణం లో నూతన భవనాల నిర్మాణం జరుగుతున్నది. పనులు చేస్తూ ఓ కుటుంబం అక్కడే నివాసం ఉంటున్నది. తల్లిదండ్రులు లేని సమయంలో ఆ కుటుంబంలోని బాలిక ఒంటరిగా ఉండటాన్ని గమనించిన ఓ వ్యక్తి.. వారు ఉంటున్న గదిలోకే తీసుకెళ్లి తలుపులు వేశాడు. ఆ చిన్నారిపై లైంగికదాడికి యత్నించాడు. బాలిక కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు రావడంతో నిందితుడు పరారయ్యాడు. లైంగికదాడికి యత్నించిన వ్యక్తి శంభు బండారిగా ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో కామాంధుడి అఘాయిత్యం, భౌతికదాడిలో తీవ్రంగా గాయపడి నిమ్స్ దవాఖానలోనే ఓ బాలిక చికిత్స పొందుతుండగా, అదే దవాఖాన ప్రాంగణంలో మరో బాలికపై లైంగికదాడి యత్నం జరుగడం చర్చనీయాంశమైంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | రైతుల పట్ల ఇలాగేనా ప్రవర్తించేది.. గజ్వేల్ ఎమ్మార్వోపై కేటీఆర్ ఆగ్రహం
గరీబ్‌పేట గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
‘సర్ ప్రక్రియపై నిష్పాక్షిక విచారణ జరపాలి’
‘యుద్ధాలతో మానవాళికి అపార నష్టం.. శాంతితోనే ప్రపంచ ప్రగతి’
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

