హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): ‘నల్లా, కరెంట్ బిల్లులు కట్టని పాతబస్తీలో రంగారెడ్డి జిల్లా ప్రజలను కలపొద్దని, ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా మున్సిపాలిటీలను విభజించరాదని చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లాను ముక్కలు చేసి ఆ జిల్లా ప్రజల ఆస్తిత్వాన్ని దెబ్బతీయొద్దని కోరారు. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లా శివారు గ్రామాలను చార్మినార్‌లో విలీనంచేసేందుకు ప్రయత్నించడం సరికాదని, ప్రజాభిప్రాయం మేరకే బల్దియాల విభజన జరగాలని పేర్కొన్నారు.