ప్రకృతి ప్రేమికుడు దుశర్లపై దాడి
ప్రకృతి ప్రేమికుడు, జలసాధన సమితి జాతీయ అధ్యక్షుడు దుశర్ల సత్యనారాయణపై గొర్రెల కాపర్లు గురువారం దాడి చేశారు.
- తాను సృష్టించిన అడవిలో గొర్రెలు మేపడాన్ని నిలదీసినందుకు గొర్రెల కాపర్ల ఘాతుకం
- సూర్యాపేట జిల్లా రాఘవాపురం ఎక్స్ రోడ్డు సమీపంలో ఘటన
- జలసాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిపై దాడిని ఖండించిన కేటీఆర్, మాజీ ఎంపీ సంతోష్
మోతె, ఏప్రిల్ 24: ప్రకృతి ప్రేమికుడు, జలసాధన సమితి జాతీయ అధ్యక్షుడు దుశర్ల సత్యనారాయణపై గొర్రెల కాపర్లు గురువారం దాడి చేశారు. సూర్యాపేట జిల్లా మోతె మండలం రాఘవాపురం ఎక్స్ రోడ్డు గ్రామ సమీపంలో ఉన్న తన 70 ఎకరాల అడవిలో గొర్రెల కాపర్లు గొర్రెలు మేపుతుండగా అడవిలో గొర్రెలు ఎందుకు మేపుతున్నారని మందలించడంతో గొడవకు దారితీసింది. గొర్రెల కాపర్లు వారి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పిలిపించి సత్యనారాయణపై కర్రలతో దాడి చేయడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. రాఘవాపురం గ్రామంలో తనకున్న 70 ఎకరాల్లో వివిధ రకాల చెట్లను 15 ఏండ్లుగా పెంచుతూ దట్టమైన అడవిగా మార్చారు. అందులో కొందరు గొర్రెలను మేపుతూ చెట్లను నరికివేస్తున్నారని దుశర్ల పేర్కొన్నారు. తాను ఎంతో ప్రేమగా పెంచుతున్న అడవిని నరికివేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
రాఘవాపురం గ్రామానికి చెందిన గొర్రెల కాపర్లు బయ్య మల్లయ్య, గంగయ్య, రోషాలు, యశ్వంత్, అరుష అడవిలోకి వచ్చి తనపై దాడి చేశారని పేర్కొన్నారు. దుశర్ల సత్యనారాయణపై దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. భౌతికదాడులకు దిగడం, ప్రకృతిని దెబ్బతీయడం సరికాదని అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. దుశర్లపై దాడి అమానుషమని మాజీ ఎంపీ, గ్రీన్ ఇండియా సృష్టికర్త సంతోష్, ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ కంచుకట్ల సుభాష్ పేర్కొన్నారు. కన్నబిడ్డల మాదిరిగా పెంచుతున్న అడవిలో గొర్రెలను మేపడాన్ని వ్యతిరేకించినందుకు దాడి చేయడం సరికాదని సూచించారు. దాడికి పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

