వినాయకనగర్/ఇందల్వాయి, జూన్ 14: నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కాల్పోల్ అటవీ ప్రాంతంలో ప్లాంటేషన్ స్థలంలో కొందరు ట్రాక్టర్లతో దున్నుతున్నట్లు తెలిసి నిజామాబాద్ సౌత్ రేంజ్ ఆఫీసర్ రాధిక సిబ్బందితో కలిసి వెళ్లారు. గమనించిన స్థానికులు కర్రలు, మట్టిపెళ్లలతో దాడి చేయడంతో ఎఫ్ఆర్వో, సెక్షన్ ఆఫీసర్ సాయికృష్ణ, ముగ్గురు బీట్ ఆఫీసర్లు గాయపడ్డారు. అటవీ అధికారుల సమాచారంతో నిజామాబాద్ సౌత్ రూరల్ సీఐ సురేశ్‌కుమార్ ఘటనాస్థలానికి చేరుకున్నారు. 30 మంది తమపై దాడి చేశారని అటవీసిబ్బంది ఫిర్యాదు చేయగా, వారిపై కేసు నమోదు చేశారు. దాడి చేసిన వారిపైవారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని బాసర యూనిట్ రేంజ్ అధికారుల అసోసియేషన్ ఉపాధ్యక్షుడు, ఇందల్వాయి రేంజ్ అధికారి రవిమోహన్ భట్ డిమాండ్ చేశారు.