హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ) : నిర్మల్ జిల్లాలోని ఓ ప్రైవేట్ దవాఖానలో పనిచేస్తున్న పీడియాట్రిషియన్ సంతోష్రాజుపై దాడి హేయమని వైద్య సంఘాలు మండిపడ్డాయి.
శుక్రవారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ)రాష్ట్ర అధ్యక్షుడు కిషన్, తెలంగాణ సీనియర్ రెసిడెంట్స్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆశిష్ అంకెం(టీ-ఎస్ఆర్డీఏ) వేర్వేరు ప్రకటనలు విడుదల చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.