హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): మంచిర్యాలలో బీఆర్ఎస్వీ నాయకుడు దగ్గుల మధుపై దాడిని బీఆర్ఎస్ ఖండించింది. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, పార్టీ నేత నడిపెల్లి విజిత్‌కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ దాడిలో గాయపడి దవాఖానలో చికిత్స పొందుతున్న మధుపై పోలీసులు కేసు నమోదు చేయడం ఏంటని ప్రశ్నించారు. మధును మరోసారి అరెస్టు చేయడానికి కుట్ర జరుగుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. .
హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ పిలుపు మేరకు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్వీ బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలు పెద్దపల్లి, వనపర్తి, రంగారెడ్డి, ఆదిలాబాద్ తదితర జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆరా తీశారు.