మంచిర్యాలటౌన్, జూన్ 2: మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి గడప రాకేశ్‌పై దుండగులు విచక్షణా రహితంగా దాడి చేశారు. హైటెక్ కాలనీలో నివాసముంటున్న రాకేశ్ ఆదివారం ఉదయం ఐదున్నర గంటలకు తన కారులో జిమ్‌కు బయలుదేరారు. లక్ష్మీటాకీసు చౌరస్తా సమీపంలోకి రాగానే ఓ వ్యక్తి బైక్‌పై వచ్చి రాకేశ్ ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టాడు. ఏం జరిగిందోనని తెలుసుకోవడానికి కారు దిగగా.. ఒక్కసారిగా 15 మందికిపైగా దుండగులు బేస్‌బాల్ కర్రలు, ఇనుప రాడ్లతో ఇష్టారీతిన రాకేశ్‌పై దాడి చేశారు.
కారు అద్దాలను పగులగొట్టారు. తలకు, పొట్టకు కర్రలు, రాడ్లు తగలకుండా రాకేశ్ జాగ్రత్తపడ్డారు. అప్పటికే రోడ్డుపై ఉన్న జనం పెద్దగా అరవడంతో వారంతా పారిపోయారు. రాకేశ్‌ను సమీపంలోని జైసాయి దవాఖానకు తరలించారు. తనపై దాడికి పాల్పడింది వంశీ, చందు, సంజీవ్, రవి అని రాకేశ్ తెలిపారు. వారితో తనకు పెద్దగా పరిచయం లేదని, కానీ తాను బీఆర్ఎస్లో చురుకుగా పనిచేసినందుకే కక్షతో దాడి చేసి ఉంటారని, కాంగ్రెస్ పార్టీకి చెందినవారేనని అనుమానం వ్యక్తం చేశారు. సీఐ బన్సీలాల్, ఎస్సైలు దవాఖానకు చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేశారు.
రాకేశ్‌పై దాడి వెనుక మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు హస్తం ఉందని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ఆరోపించారు. మంచిర్యాల దవాఖానలో చికిత్స పొందుతున్న రాకేశ్‌ను బీఆర్ఎస్ నేత, ఆయన కుమారుడు విజిత్రావుతో కలిసి పరామర్శించారు. పథకం ప్రకారమే దాడిచేశారని, మంచిర్యాలలో అలజడి సృష్టిస్తున్నారని, దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.