బాల్కొండ, జూన్ 4: నిజామాబాద్ జిల్లా బాల్కొండలోని ఎస్బీఐ ఏటీఎంను కొల్లగొట్టిన నిందితులు రూ.25 లక్షల నగదుతో ఉడాయించారు. మంగళవారం తెల్లవారుజామున 2.30 గంటలకు కారులో వచ్చిన దుండగులు ఏటీఎం ఎంట్రెన్స్‌లో ఉన్న సీసీ కెమెరాలకు నల్లని రంగు స్ప్రే చేశారు.
ఆ తర్వాత కొద్దిసేపటికి గ్యాస్ కట్టర్‌తో ఏటీఎం మెషిన్‌ను కట్ చేశారు. అదే సమయంలో ముంబైలో ఉన్న అధికారులకు అలర్ట్ మెస్సేజ్ వెళ్లడంతో స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చారు. డయల్ 100కు కాల్ చేసి సమాచారమివ్వగా, పోలీసులు వచ్చేలోపే ఏటీఎంలో ఉన్న రూ.24, 92,600 నగదుతో పరారయ్యారు. ఆర్మూర్ ఏసీపీ బస్వారెడ్డి, రూరల్ సీఐ శ్రీధర్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు.