హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ పరీవాహక ప్రాంతాల పరిరక్షణకు ఏర్పాటైన హైపవర్ కమిటీ ఏం చేసిందో చెప్పాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జీవో 111 రద్దుతోపాటు జీవో 69ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లు సోమవారం మరోసారి విచారణకు రావడంతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్ ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.