హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ మహేశ్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ కుంభకోణం కేసులో ఆ బ్యాంకు మాజీ ఎండీ, సీఈవో ఉమేశ్ చంద్ అసవా, ఆయన కుటుంబసభ్యులకు చెందిన రూ.1.1 కోట్ల విలువైన రెండు స్థిరాస్తులను ఈడీ జప్తు చేసింది. బ్యాంక్ చైర్మన్ రమేశ్ కుమార్ బంగ్తోపాటు మాజీ ఎండీ, సీఈవో ఉమేశ్చంద్ అసవా, సీనియర్ వైస్ చైర్మన్ పురుషోత్తందాస్ మంధాన అక్రమాలకు పాల్పడ్డారంటూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన విష యం తెలిసిందే.
మనీ లాండరింగ్ చట్టం కింద దర్యాప్తు చేపట్టిన ఈడీ.. నిందితులు తమ అధికారాలను దుర్వినియోగం చేసి, అనర్హులకు అక్రమంగా రుణాలు మంజూరు చేసినట్టు తేల్చింది. రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో ఉమేశ్ కుటుంబసభ్యులు కొనుగోలు చేసిన రెండు ఆస్తులను జప్తు చేసినట్టు ఈడీ వెల్లడించింది.