CM KCR | నేటితో ముగియనున్న అసెంబ్లీ సమావేశాలు.. ఉభయ సభల్లో కీలక ప్రసంగం చేయనున్న సీఎం కేసీఆర్
అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు (Assembly session) నేటితో ముగియనున్నాయి. సమావేశాల్లో నాలుగో రోజైన ఆదివారం.. ఉభయ సభల్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం-సాధించిన ప్రగతిపై స్వల్పకాలిక చర్చ జరుగనుంది.
హైదరాబాద్: అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు (Assembly session) నేటితో ముగియనున్నాయి. సమావేశాల్లో నాలుగో రోజైన ఆదివారం.. ఉభయ సభల్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం-సాధించిన ప్రగతిపై స్వల్పకాలిక చర్చ జరుగనుంది. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) కీలక ప్రసంగం చేయనున్నారు. ఈ నేపథ్యంలో శాసనసభ, మండలిలో ప్రశ్నోత్తరాలను (Question hour) రద్దుచేశారు. నేరుగా స్వల్పకాలిక చర్చ చేపడతారు.
శనివారం శాసనసభలో మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వ ర్, మల్లారెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ ప్రవేశపెట్టిన ఐదు బిల్లులకు స్పీకర్ ఆమోదం తెలిపారు. వీటిలో తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) యాక్ట్-2023, ఫ్యాక్టరీల (తెలంగాణ సవరణ) బిల్లు, తెలంగాణ రాష్ట్ర మైనార్టీ వర్గాల కమిషన్ (సవరణ) బిల్లు, గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ బిల్లు, తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్ రెండో సవరణ బిల్లులు ఉన్నాయి. ఇవన్నీ ఏకగ్రీవంగా ఆమోదం పొందాయి.
నాలుగు బిల్లులకు మండలి ఆమోదం తెలిపింది. గతంలో ఉభయ సభలు ఆమోదించిన బిల్లులను గవర్నర్ తిప్పి పంపించడంతో ప్రభుత్వం వాటిని సభలో ప్రవేశపెట్టి మరోసారి ఏకగ్రీవంగా ఆమోదించింది. నగర పాలక సంస్థల్లో కోఆప్షన్ సభ్యుల సంఖ్య 5 నుంచి 15 పెంపు, వైద్య ప్రొఫెసర్ల పదవీ కాలం 61 నుంచి 65 ఏండ్లకు పొడిగింపు బిల్లులను ఆర్థికమంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టారు. ప్రైవేటు యూనివర్సిటీల బిల్లు విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, భద్రాచలం గ్రామ పంచాయతీని కొత్తగా మరో రెండు పంచాయతీల ఏర్పాటు బిల్లును పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రవేశపెట్టారు. ఈ నాలుగు బిల్లులకు శాసనమండలి ఆమోదం తెలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

