హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): ఈ నెల 12న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు గురువారం ముగిశాయి. మొత్తం 11 రోజుల్లో.. 97.32 గంటలపాటు సమావేశాలు కొనసాగాయని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ప్రకటించారు. 12 బిల్లులు ఆమోదం పొందినట్టు తెలిపారు.
16 స్టార్డ్ ప్రశ్నలకు స మాధానాలు తెలిపినట్టు చెప్పారు. 27 ప్రశ్నల కు సమాధానాలు టేబుల్ చేసినట్టు పేర్కొన్నా రు. సభ్యులు మొత్తం 146 ప్రసంగాలతోపాటు 3 తీర్మానాలు చేసినట్టు ఆయన వెల్లడించారు. కాగా, శాసనసభతో పాటు మండలి కూ డా నిరవధికంగా వాయిదా పడ్డాయి.