నర్సంపేట, అక్టోబర్ 27 : నాలుగేళ్ల చిన్నారిపై ఓ బాలుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలో చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌కు వెళ్తూ తన నాలుగేండ్ల కుమార్తెను ఇదే గ్రామంలోని తన తల్లివద్ద ఉంచింది. ఈనెల 25న చిన్నారిని అమ్మమ్మ అంగన్వాడీ స్కూల్లో అప్పగించింది. అంగన్వాడీ టీచర్ కుమారుడు (16) తన తల్లి లేని సమయంలో చిన్నారిని పక్కకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్టు సమాచారం. అదే రోజు సాయంత్రం కడుపునొప్పి అంటూ చిన్నారి ఇంటికి రాగా అనుమానం వచ్చిన అమ్మమ్మ పరిశీలించగా గాయాలు కన్పించాయి. వెంటనే ఇంటికి వచ్చిన బాలిక తల్లి స్థానిక మహిళలతో కలిసి ఖానాపురం పోలీసులకు అంగన్వాడీ టీచర్ కొడుకుపై ఫిర్యాదు చేసింది.
కామారెడ్డి, అక్టోబర్ 27: బీహార్ కూ లీ దళిత యువతిపై అఘాయిత్యానికి పా ల్పడిన ఘటన కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఫరీద్‌పేటలో చోటుచేసుకుం ది. పోలీసుల కథనం ప్రకారం.. బీహార్ నుంచి వలస వచ్చిన ఓ వ్యక్తి ఫరీద్‌పేట్ సమీపంలోని రైస్‌మిల్‌లో కూలీగా పని చేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం పత్తి చేనులో పని చేసుకుంటున్న మహిళ (45)ను గమనించిన సదరు కూలీ.. ఆ మెపై లైంగికదాడికి ఒడిగట్టాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని స్థానికులు గుర్తించి కామారెడ్డి దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. దీంతో దళిత సంఘాల నేతలు సోమవారం రైస్‌మిల్‌ను ముట్టడించి బాధిత మహిళకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.