హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): ఫోన్ల ట్యాపింగ్ కేసులో సస్పెన్షన్కు గురైన అదనపు ఎస్పీ తిరుపతన్నకు ఊరట లభించింది. గత 10 నెలలుగా జైలులో ఉన్న ఆయనకు సుప్రీంకోర్టు సోమవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు దర్యాప్తునకు సహకరించాలని, సాక్షులను ప్రభావితం చేయరాదని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ ధర్మాసనం ఆయనకు స్పష్టం చేసింది.