ఇస్లామాబాద్, నవంబర్ 4: ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వం పాకిస్థాన్ ఆర్మీ చీఫ్, ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ పదవీకాలాన్ని పెంచబోతున్నట్టు కనపడుతున్నది. ఆర్మీ చీఫ్‌గా అసీం మునీర్ పదవీకాలం నవంబర్ 28తో ముగియనున్నది. ఈ ఏడాది ఆరంభంలో ఫీల్డ్ మార్షల్ హోదాను పొందిన అసీం మునీర్, ఆ హోదాలో ఆర్మీ చీఫ్‌గా కొనసాగేందుకు అవకాశం లేదు. పాకిస్థాన్ రాజ్యాంగం, ఆర్మీ యాక్ట్‌లో ‘ఫీల్డ్ మార్షల్’ అనే పదానికి ఎలాంటి నిర్వచనం లేదు. ఈ హోదా కేవలం లాంఛనప్రాయమైంది. దీంతో ఆర్మీ చీఫ్‌గా మునీర్ 2027 వరకు కొనసాగుతారా? అధికారికంగా పదవీకాలాన్ని పొడి గిస్తారా? అన్నది గందరగోళంగా మారింది.