Public Voice |ఎస్సీ, ఎస్టీలకు వంద యూనిట్ల వరకు ఉచితంగా కరెంటిస్తర్రంటే దరఖాస్తు జేసుకున్న. మా సర్వీస్ నంబర్ 291. మా ఇంట్లో రెండు లైట్లు, ఓ పంక ఉంది. రెండేండ్ల సంది మా ఇంటి కరెంటు బిల్లు సర్కారోళ్లే కడుతున్రు. మాపటీలి లైటేసుకుంటం. రాత్రి పడుకునేటప్పుడు బంజేస్తం. కరెంటు పొదుపుగా వాడుతం కావట్టే మాకు 100 యూనిట్లలోపే కరెంటు కాలుతది. సర్కారోళ్లు ఇప్పటిదాకా రూ.4,907 బిల్లు కట్టిన్రని కరెంటు సార్లు చెప్పిన్రు. సీఎం కేసీఆర్ సారు మాలాంటి పేదోళ్లకు మస్తు సాయం జేస్తున్నడు. మాకేగాదు, మా లెక్క మా ఊర్లో మస్తు మందికి ఉచితంగా కరెంటిస్తన్రు. గిసొంటి సీఎం ఉన్నంతకాలం మా బతుకుల్లో వెలుగులకు ఢోకా లేదు.
నళ్లి భీమయ్య, దహెగాం, ఆసిఫాబాద్ జిల్లా