Sweepers | కాంగ్రెస్ సర్కార్ పాలనలో ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, రిటైర్డ్ ఉద్యోగులు, విద్యార్థులు.. ఇలా ప్రతీ ఒక్కరూ రోడ్డెక్కాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ప్రత్యేకించి చెప్పనసరం లేదు. పెండింగ్ బకాయిలు విడుదల చేయాలంటూ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ఆందోళన చేపడుతుండగా.. కాంట్రాక్టర్లు, రిటైర్డ్ ఉద్యోగులు మరోసారి సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఛాంబర్ ముందు ఆందోళన కూడా నిర్వహించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్వీపర్లు కూడా నిరసన బాట పట్టారు. 20 నెలలుగా జీతాలు ఇవ్వట్లేదని సెక్రటేరియట్లో భట్టి ఛాంబర్ వద్ద స్వీపర్లు ఆందోళన చేపట్టారు. ఓ స్వీపర్ మీడియాతో మాట్లాడుతూ.. మా కనీస వేతనం రూ.5200.. మాకు 20 నెలల నుంచి వేతనాలు రావడం లేదు.. మేం పొద్దున్నే పోయి శుభ్రం చేసి బాత్రూంలు కడిగిన తర్వాత అధికారులు వచ్చి కూర్చున్నారు. అధికారులెవరూ మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మేం శుభ్రం చేసిన తర్వాతే వస్తున్నారు.. మాతో వెట్టి చాకిరి చేయించుకుంటున్నారు. అలాంటిది మాకే జీతాలు ఇవ్వడం లేదన్నాడు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని, భట్టి సార్‌ను కలిసినం. ప్రజాభవన్‌కు వెళ్లినం. మాకు నెలకు వచ్చేది రూ.5200. మమ్మల్ని పార్ట్‌టైం వర్కర్లు అని చెప్పారు. మొత్తం 33 జిల్లాల్లో కలిపి 4500 మంది ఉంటం. మేం కలిస్తే సీఎం రేవంత్ రెడ్డిని కలుద్దామనే వచ్చినం. అపాయింట్ మెంట్ కోసం కూడా చాలా చోట్ల తిరిగినం. అయినా కానీ మాకు అపాయింట్మెంట్ దొరకలేదని వాపోయాడు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ హయాంలో స్వీపర్ల పరిస్థితి ఎలా ఉందో ఈ వ్యక్తి చెబుతున్న మాటలు కండ్లకు కట్టినట్టు చూపిస్తున్నాయి.
20 నెలలుగా జీతాలు ఇవ్వట్లేదని సెక్రటేరియట్లో భట్టి ఛాంబర్ వద్ద స్వీపర్ల ఆందోళన
మాతో గొడ్డు చాకిరి చేయించుకొని జీతాలు అడిగితే అధికారులు మమ్మల్ని పట్టించుకోవడం లేదు
భట్టిని, పొంగులేటిని కలిసినా పట్టించుకోవడం లేదు
తెలంగాణ వ్యాప్తంగా 4 వేల మంది స్వీపర్లకు, స్కావెంజర్లకు 20… https://t.co/ZbPbjrhQB3 pic.twitter.com/Y77QXYqftY
— Telugu Scribe (@TeluguScribe) September 29, 2026
Allu Arjun | భార్యతో అల్లు అర్జున్ రొమాంటిక్ మూమెంట్.. స్నేహారెడ్డికి బన్నీ స్పెషల్ విషెస్ వైరల్!
Srinivas Reddy | ప్రజలవిశ్వాసమే.. జర్నలిస్టులకు రక్షణ.. ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి
కడు పేదరికం నుండి యువ ద్రోణాచార్యుడిగా పొన్నాల పృథ్వీరాజ్