వరంగల్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మేడారం దారులన్నీ పోటెత్తుతున్నాయి. ములు గు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జరిగే సమ్మక్క – సారలమ్మ మహా జాతరకు తెలంగాణతోపాటు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా రాష్ర్టాల నుంచి భారీగా తరలివస్తున్నారు. బుధవారం సాయంత్రం సారలమ్మ గద్దెపైకి రాగానే జాతర ప్రారంభమవుతుంది. గురువారం స మ్మక్క గద్దెలపైకి వస్తుంది. ఇద్దరు వన దేవతలు గద్దెల పై కొలువుదీరి శుక్రవారం మొక్కులు అందుకోనున్నా రు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూ నుగొండ్ల నుంచి పగిడిద్దరాజు పెండ్లికొడుకై మంగళవారమే బయలుదేరగా బుధవారం మేడారం చేరుకొంటారు. ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజు బుధవారమే గద్దెలపైకి చేరుకోనున్నారు.
రూ.75 కోట్లతో ఏర్పాట్లు..
ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ ఉత్సవంగా ప్రసిద్ధిగాంచిన మేడారం జాతరకు ఈ సారి 1.25 కోట్ల మం ది వస్తారనే అంచనాతో రాష్ట్రప్రభుత్వం రూ.75 కోట్ల తో ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే 50 లక్షల మంది భక్తు లు మొక్కులు చెల్లించుకొన్నారు. ఈ 4 రోజుల్లో మరో 40 నుంచి 50 లక్షల మంది వచ్చే అవకాశం ఉన్నది.
వైద్య శిబిరాల ఏర్పాటు..
ఆరోగ్య సేవల కోసం 35 వైద్య శిబిరాలు, 40 ప్రాథమిక చికిత్స కేంద్రాలు, గద్దెల సమీపంలో 50 పడకల దవాఖాన, ఇంగ్లిష్ మీడియం స్కూల్ ఆవరణలో ఆరు పడకల వైద్యశాలను ఏర్పాటు చేశారు. 150 మంది స్పెషలిస్టులు, 761 మంది సిబ్బందిని కేటాయించా రు. పారిశుద్ధ్య నిర్వహణకు పంచాయతీరాజ్ శాఖ 5 వేల మంది శానిటేషన్ సిబ్బందిని నియమించింది. 327 ప్రాంతాల్లో 6,700 మరుగుదొడ్లు నిర్మించారు. ట్రాఫిక్ నియంత్రణ, ఇతర ఏర్పాట్లకు 9 వేల మంది పోలీసులు పనిచేస్తున్నారు. రాకపోకలకు ఇబ్బంది లేకుండా 33 పార్కింగ్, 37హోల్డింగ్ ప్రదేశాలు ఏర్పా టు చేశారు. ఆర్టీసీ ప్రత్యేకంగా 3,845 బస్సులు నడుపుతున్నది. ఇక జాతర రోజులు కావడంతో మేడారం పరిసరాలు, రోడ్లు, అడవులు భక్తులు, వాహనాలతో నిండిపోతున్నాయి. పొలాల్లో గుడారాలు వెలిశాయి.